ఈ నెల 30వ వరకు డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

Published: Tuesday October 25, 2022
మంచిర్యాల బ్యూరో,  అక్టోబర్ 22, ప్రజాపాలన :
 
జాతీయ పంచాయతీ అవార్డులకు జిల్లాలోని గ్రామాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని 311 గ్రామపంచాయతీల పూర్తి వివరాలతో డాటా అప్లోడ్ విధానాన్ని పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమీషనర్ పి. రామారావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రితో కలిసి డి.ఎల్.పి.ఓ.లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులతో జాతీయ పంచాయతీ అవార్డులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ పంచాయతీ అవార్డుల కొరకు జిల్లాలో మండలానికి 2 చొప్పున 20 గ్రామాలను ఎంపిక చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని రంగాలలో ముందున్న ఉత్తమ గ్రామాలను గుర్తించాలని, ఈ నెల 30వ తేదీ లోగా జిల్లాలోని 311 గ్రామపంచాయతీల డాటా ఎంట్రీ పూర్తి చేసి ఫ్రీజ్ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో డి.ఎల్.పి.ఓ.లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.