ప్రతి భారతీయ పౌరుడు జంతువుల పట్ల కరుణ దయ చూపాలి

Published: Wednesday February 01, 2023
జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్
వికారాబాద్ బ్యూరో 31 జనవరి ప్రజా పాలన : ప్రతి భారతీయ పౌరుడు జంతువుల పట్ల కరుణ దయ చూపాలని జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం
జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు సంరక్షణ పక్షోత్సవాలను జనవరి 14 నుండి 31 వరకు వికారాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగిందని జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు.  జంతు సంరక్షణ పక్షోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తగడిలో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.  ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు హేమలత కొత్తగడి పశు వైధ్యాధికారిని డా.ఉష ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్ధులందరికి జంతు సంక్షేమం ,సంరక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య & పశు సంవర్ధక శాఖ అధికారి డా.పి.అనిల్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై జంతు సంరక్షణ , సంక్షేమంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలో గెలుపొందిన 6,7,8,9, 10 వ తరగతి విద్యార్థులకు బహుమతులు అందజేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య కార్యాలయ సహాయ సంచాలకులు డా.పి.ప్రహ్లాద్ విద్యార్థులకు జంతుల పట్ల అవగాహన కల్పిస్తూ భారత పౌరులకు జంతువుల పట్ల కరుణ , దయ కలిగి ఉండి వాటి సంరక్షణకు కృషి చేయాలని, జంతు హింస చేయరాదని, జంతువులకు విధిగా టీకాలు వేయించి రోగాల బారిన పడకుండా కాపాడాలని కోరుతూ ఇందుకోసం రాజ్యాంగంలో 51 (A)(g) ఆర్టికల్ పొందుపరచడం జరిగిందని తెలిపినారు. ప్రతి భారత పౌరుడు వన్య ప్రాణుల్ని ప్రకృతి సంపదలను పరిరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడాలని కోరినారు. ముఖ్య అతిధిగా డా.పి.అనిల్ కుమార్  జంతు సంరక్షణ చట్టాలు,జిల్లా జంతు సంరక్షణ సంస్థ మరియు రాష్ట్ర  జంతు సంరక్షణ సంస్థల విధులు తెలియజేసినారు. జంతు సంరక్షణ చేయు స్వచ్చంద సంస్థలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరినారు. అనంతరం కొత్తగడి వార్డు-1 లో విద్యార్థులు ,పుర పౌరులు, పాఠశాల అధ్యాపకులు శాఖ సిబ్బందిచే నినాదాలు  ప్లే కార్డులు చేత బూని ర్యాలీ నిర్వహించి ప్రజలకు జంతు సంరక్షణ,సంక్షేమము పై అవగాహన కల్పించినారు.