పల్లె అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి

Published: Friday July 09, 2021
వికారాబాద్, జూలై 08, ప్రజాపాలన బ్యూరో : పల్లె అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ పల్లి, జైదుపల్లి, గోధంగూడ గ్రామాల సర్పంచులు షాకేరాబేగమ్ ఫకీరాఖాన్, బుడిగె ఎల్లమ్మ లక్ష్మణ్, అనిత సత్తయ్యగౌడ్ ల ఆధ్వర్యంలో పల్లె ప్రగతి పనులను నిశితంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. గ్రామ ప్రవేశ రోడ్డుకు ఇరువైపులా పెద్ద మొక్కలు నాటి కంచె ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ కంఠం ఖాళీ స్థలాల్లో పశువులు, మేకలను కట్టేసిన యజమానులకు జిపి నుండి నోటీసు ఇవ్వాలని పేర్కొన్నారు. పునరావృతమైతే ఇంటి యజమానులకు జరిమానా విధించాలని గ్రామ కార్యదర్శులకు చెప్పారు. ప్రతి ఇంటికి అందజేసిన మొక్కలను విధిగా నాటించి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన పూర్తి బాధ్యత కార్యదర్శులు రాఘవేందర్ రెడ్డి, నవనీతలు చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కామిడి చంద్రకళ, ఎంపిడిఒ సుభాషిణి, ఎంపిఒ నాగరాజు, గ్రామ స్థాయి అధికారులు, పెద్దింటి నర్సిములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.