డిజిటల్ టీవీని ప్రారంభించిన ఎంపీపీ..

Published: Tuesday November 23, 2021
తల్లాడ, నవంబర్ 22 (ప్రజాపాలన న్యూస్): మండల పరిధిలో అన్నారుగూడెం అంగనవాడి-7 సెంటర్ లో డిజిటల్ టీవీని తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఐ పౌండేషన్ సహకారంతో డిజిటల్ టీవీని బహుకరించిన దాతలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారెళ్ల మమత, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు వెంకట్ లాల్, ఎంపీడీవో రవీంద్రారెడ్డి, ఎంఈఓ దామోదర ప్రసాద్, అంగన్వాడి సూపర్వైజర్ శారద, సిపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, పంచాయతీ సెక్రెటరీ వేణు, అంగన్వాడీ టీచర్ మీనా కుమారి, పాల్గొన్నారు.