వైకుంఠధామాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Friday July 02, 2021

బెల్లంపల్లి, జూలై 1, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్గం లోని నెన్నెల మండలకేంద్రంలో నూతనంగా నిర్మించిన వైకుంఠ దామాన్ని (స్మశానవాటికను) గురువారం నాడు ప్రారంభించి మొక్కలు నాటిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చనిపోయిన వారిని కరణం చేయాలంటే ఎన్నో కష్టాలు పడేవారని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక చనిపోయిన వారిని ఖననం చేయడానికి ఇబ్బందులు ప్రజలు పడకూడదని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి పట్టణానికి స్మశాన వాటిక అనేది ఉండాలని భావించి ఖననం చేయడానికి కి ప్రత్యేక ఏర్పాట్లతో ఏ లోటు రాకుండా వైకుంఠధామం లోనే అన్ని ఏర్పాట్లతో వైకుంఠధామాలు నిర్మిస్తున్నారని, ఇది ఇది ఎంతో గొప్ప ఆశయంతో కూడుకున్న పని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి-భీమాగౌడ్, ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శ్యామల-రాంచందర్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కో ఆప్షన్ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.