ప్రకృతి వరప్రదాయిని దివ్యౌషధం తేనె - తియ్యని తేనె గురించి తెలుసుకుందామా డా యం. అఖిల మిత్ర,

Published: Friday December 30, 2022

ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది, బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేద మరియు ప్రకృతి  వైద్యంలో విరివిగా వాడే వాటిలో ఇది ఒకటిది.   తేనెలో యాంటిసెప్టిక్, యాంటీబయాటిక్, విటమిన్ బి 1, విటమిన్ బి 6 కూడా సమృద్ధిగా ఉంటాయి. తేనె సేవించడం ద్వారా కంటి చూపు పెరుగుతుంది.. కఫం, ఉబ్బసం, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న తేనెను వేడి పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో  తెలుసుకోండి.  తేనెటీగలు పువ్వుల నుంచి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్ని తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతం కన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండటానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టకముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానే. మొట్టమొదటి మద్యాన్ని తయారుచేసింది తేనెతో. ప్లేటో, అరిస్టాటిల్, డిమొక్రటిస్... లాంటి తత్త్వవేత్తలంతా తేనె వైశిష్ట్యాన్ని తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. మన ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది. శుశ్రుత సంహిత తేనెను తాగే మందు గా వర్ణించింది, శ్వాసకోశ వ్యాధులకు మధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది.
వేడి పాలలో తేనె కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతోపాటు నాడీ కణాల సమస్యలుంటే.. అవి దూరమై.. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. మంచిగా నిద్రపోవడానికి వెచ్చని పాలలో తేనె కలిపి తాగడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది. నిద్రపోవడానికి ఒక గంట ముందు వెచ్చని పాలలో తేనె కలిపి తాగాలి. జీర్ణక్రియను మెరుగుపడటానికి వేడిపాలలో క్రమం తప్పకుండా తేనె కలిపి తాగాలి. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఎముకలు బలంగా తయారవడానికి వేడిపాలలో హనీ కలిపి తాగితే ప్రయోజనం. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు దూరమవుతాయి. పాలలో తేనెను కలిపి క్రమం తప్పకుండా తాగడం వల్ల శారీరక.. మానసిక మానసిక సమస్యలు దూరమై రోగనిరోధక శక్తి పెరుగుతుంది నిపుణులు చెబుతున్నారు.
తేనెని సాధారణంగా మన డైట్‌లో చేర్చుకోవడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె & గోరువెచ్చని నీరు.

మన జీవన విధానంలో వేడి నీరు కొన్ని అద్భుతాలనే చేస్తాయి. ఇంకా ఎక్కువగా నీరుత్రాగడం వల్ల కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల అందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు . కాబట్టి, ఇంతటి ఎఫెక్టివ్ వేడినీటిని వదిలేసి, చల్లటి నీరు త్రాగడంలో ప్రయోజనం లేదు.
 ప్రెగ్నెంట్ కావాలంటే వారానికి ఎన్నిసార్లు శృంగారం చేయాలంటే..
ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఒక రోజుకు 7-8 గ్లాసుల నీరు, ప్రతి ప్రాణికి అవసరం అవుతుంది. అందువల్ల చాలా మంది కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే, కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్‌కు బదులు వేడినీటిని, గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం. అయితే చాలా మందికి గోరువెచ్చని నీరు తాగడం ఇష్టముండదు , కాబట్టి, అందులో కొద్దిగా తేనె జోడించి తాగితే మరింత అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.

నిమ్మ, తేనె మిక్స్ టీ

మీరు రెగ్యులర్‌గా లెమన్ టీ తాగుతారా? అయితే మీరు కచ్చితంగా లక్కీనే. ఎందుకంటే లెమన్‌ టీలో మీరు ఊహించని విధంగా మిరాకిల్ బెనిఫిట్స్ ఉన్నాయి.! ఇది శరీరంను శుభ్రం చేస్తుంది. బాడీని రిఫ్రెష్ చేసి, ఎనర్జీని అందిస్తుంది.

లెమన్ టీ అంటే బ్లాక్ టీ వంటిది లేదా గ్రీన్ టీ లిక్కర్, వీటికి నిమ్మరసం కలపడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. హాట్ టీకి నిమ్మరసం , కొద్దిగా పంచదార మిక్స్ చేయడమే లెమన్ టీ. మసాలా లెమన్ టీ అంటే హాట్ టీలో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, నిమ్మరసం, బ్లాక్ సాల్ట్, పంచదారను మిక్స్ చేసి ఉంటారు. ఇది కొద్దిగా వగరుగా, స్పైసీ టేస్టీతో ఉంటుంది. నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల ఇది కలర్ ,ఫ్లేవర్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా పెంచుతుంది. అయితే టీలో సరైన మోతాదులో నిమ్మరసంను జోడించాలి.

తేనె, పాలు

పాలు, తేనెలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అవి విడివిడిగానే ఎంతో మేలు చేస్తే, కలిపి ఇంకెంత మేలు చేస్తాయో. వీటిని తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని తేనెను ఏ విధంగా సేవించినా  ప్రయోజనాలే. ఎన్నో ఔషధాలు ఉన్న తేనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు. తేనెలో ఫ్రూట్ గ్లూకోజ్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫేట్, సోడియం, క్లోరిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియా నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. హనీలో యాంటిసెప్టిక్, యాంటీ బయాటిక్, విటమిన్ బి 1, విటమిన్ బి 6 కూడా సమృద్ధిగా ఉంటాయి. తేనె తాగితే కంటి చూపు పెరుగుతుంది.. కఫం, ఉబ్బసం, అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

తేనె, నిమ్మరసం..

మనం చాలా మందిని పొద్దున్నే తేనె, నిమ్మరసం కలిపి తాగటాన్ని చూస్తుంటాం. నిజానికి, రోజును ఈ హాయినిచ్చే డ్రింక్‌తో మొదలుపెట్టడం మంచిదే. ఈ రసం చర్మంలో విషపదార్థాలను తగ్గించి, శరీరాన్ని క్రమబద్ధీకరిస్తుంది. చాలామంది ఈ తేనె, నిమ్మరసం కేవలం బరువు తగ్గటానికే ఉపయోగపడుతుంది అనుకుంటారు. అంటే మీకు పూర్తి అవగాహన లేదని అర్థం. ఈ తేనె, నిమ్మరసం ఉపయోగాలను మీరు ఊహించలేరు కూడా. పసుపుతో ఇలా చేస్తే విటమిన్ డి లోపం తగ్గుతుంది.
తేనె & జీలకర్ర నీళ్ళు..

కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు మన వంటగది చక్కటి పరిష్కారం. కొన్ని రకాల ఇంటి చిట్కాలు.. మన ఇమ్యునిటీని పెంచడమే కాదు.. కొన్ని ప్రాణాంతక వ్యాధులు రాకుండా అరికడతాయి. అలాగే.. జీలకర్రలోని అమోఘమైన ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలుసు. మీకు తెలుసా.. జీలకర్రను నీరు, తేనెతో కలిపి తీసుకోవడం అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు.


ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. ఇలా కృత్రిమంగా జరిగే ఈ తేనెటీగల పెంపకం, తేనె సేకరణ వల్ల తేనెపట్టుల్లో లభించే తేనె ప్రమాణం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇక అడవుల్లో లభించే కాడు తేనె సంగతి సరేసరి. ఇప్పటికే సగానికి క్షీణించిన ఈ అడవి తేనె మరి కొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగే అవుతుందేమోననే భయాన్ని ప్రకృతి ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాది నుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందు నుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తూ  ఉన్నారని చెప్పవచ్చు. స్పెయిన్‌లోని వలెన్సియా అనే ప్రాంతంలోని గుహలో అడవి తేనె వేటకు సంబంధించిన చిత్రాలున్నాయి. ఇవి 8 వేల సంవత్సరాల నాటివని చారిత్రకులు నిర్ధారించారు కూడా.నిజానికి తేనెటీగ జీవన చరిత్ర ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞ్రుడు హ్యూబర్‌కు దక్కుతుంది. రెండు వందల సంవత్సరాల క్రితం స్వతహాగా గుడ్డి వాడినప్పటికీ భార్య, సహాయకురాలి సాయంతో రాణి ఈగ తన గూడుకు చాలా దూరంలో ఉన్న మగ ఈగతో ఎలా సంపర్కం పెంచుకుంటుంది? తేనె పట్టు ఉన్న  రంధ్రాలు సైజు చూసి కూలి మగ ఈగలను, వాటి సంఖ్య ఎలా గుర్తించవచ్చో హ్యూబర్ వివరంగా తెలియజేశారు. సహజంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల్లో సాధారణంగా కనిపించే అడవి తేనెటీగల రకాల్లో ఎపిస్ దోర్సలా, అపిస్ సెరెనా ఇండికా, ఎపిస్ ఫ్లోరియా, డ్యామెస్ బీ లేదా స్ప్రింగ్‌లెస్ బీ అనేవి ముఖ్యమైనవి. వీటికి తోడు ఐరోపానుంచి దిగుమతి చేసుకున్న ఎపిస్ మెల్లిఫేరా విదేశీ జాతి. ప్రపంచవ్యాప్తంగా కనిపించే తేనెటీగ రకాలు ఇవి. వీటిలో మొదటి రకం తేనెను సేకరించే వారు చాలా ఎత్తయిన చెట్లకు నిచ్చెనలు కడతారు. పక్క చెట్టు నుంచి ఇంకో చెట్టుకు పొడవాటి తాడు వేసి దాటుతూ పోతూ రాత్రిపూట తేనెపట్టును కొడుతూ ఉంటారు. గతంలో ఇలాంటి పెద్ద తేనెటీగల తేనె పట్టు నుంచి 70 కిలోల దాకా తేనె లభించిన సందర్భాలు కూడా ఉన్నాయి దాదాపు 45 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉండి శ్రీపతి భట్ అంటారు. అప్పట్లో సగటున ఒక్కో తేనెపట్టు నుంచి 15 నుంచి 20 కిలోల దాకా తేనె లభించేది. అది ఇప్పుడు 5 నుంచి 10 కిలోల తగ్గిపోయిందంటారాయన. మిగతా రకాల తేనెల దీ అదే పరిస్థితి. పాతికేళ్ల క్రితం తేనెకు గిరాకీ దారులే ఉండేవారు కాదు. చాలా దూరం నుంచి ఒకరిద్దరు దళారీలు వచ్చే వారు. ఒక్క ఉత్తర కన్నడ జిల్లాలోనే ఏడాదికి 400 టన్నుల తేనె లభిస్తూ ఉండేదని చాలా ఏళ్లుగా అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేసే నాసిర్ ఖాన్ గతాన్ని గుర్తు చేసుకుంటూ అంటారు. ఉసిరి మరియు తేనె యొక్క సాధారణ పేస్ట్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, ఇది కోవిడ్‌తో పోరాడటానికి చాలా అవసరం. ఉసిరి మరియు తేనె సహజ  రోగనిరోధక శక్తిని నిర్మించడంలో సహాయపడతాయి. మన శక్తి మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించడం లో మనం తినే ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుంది.తేనె సంపూర్ణ పోషక పదార్ధమని, తిరుగులేని ఔషధ గుణాలు కలిగి ఉన్నదని తెలుసుకున్నాక దానిని సేకరించిన తీరు, నిలువ చేసేందుకు వాడే విధానం బట్టి పలు రకాలుగా విభజించారు.అడవి తేనె: ఇది అత్యంత సహజమైనది. అడవిలో లభించే అన్ని రకాల పూల నుంచి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి కనుక చాలా మంచిది.ఒకే పూవు తేనె: ఇది తేనెటీగల పెంపకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒక్కొక్క తరహా పూల మకరందము ఒక్కో రుచి ఉంటుంది. తేనెటీగలకు ఏదో ఒక రకమైన పూల మొక్కలు మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా దీనిని తయారు చేస్తారు.మిశ్రమ తేనె: మార్కెట్ లో అధికంగా అమ్మే తేనె ఇదే. నాలుగయిదు రకాల తేనెలను భిన్నరుచి, రంగులు కలిగినవి కలిపేస్తారు ఈ మిశ్రమం తేనెలో. రంగు, రుచిని బట్టి రకరకాల పేర్లు పెడతారు.పుట్ట తేనె: ఇది తేనె పట్టును అలాగే తీసుకువచ్చి అందులోని తేనెను సేకరించి వెనువెంటనే అందించేది . దీనిని తాజా తేనెగా భావించాలి.నిలువ తేనె: తేనెను నిల్వ చేసేందుకు భిన్న విధానాలు ఉన్నాయి. పాలను పాశ్చరైజ్ చేసిన తీరునే తేనెను పాశ్చరైజ్ చేస్తారు. దానిలోని సూచ్మజీవులను తొలగించి, దానిలోని ఎంజైమ్‌ ల చర్యలను పరిమితం చేయడం ద్వారా తేనె ఎక్కువ కాలం నిలువ ఉండేలా చే్స్తారు. ఈ ప్రక్రియలో తేనెను వేడి చేయడం జరుగుతుంది. వేడి చేయడం వల్ల కొన్ని నష్టాలున్నాయి. దీన్ని అధిగమించేందుకు నేడు ఆల్ట్రాసోనిక్ తేనెను తయారు చేస్తున్నారు. దీనివల్ల తేనె పులియకుండా ఉంటుంది.ఎండు తేనె: ఇది మరో ప్రత్యేకమైనది. తేనెను ఘన రూపంలో తయారుచేస్తారు. ఇది చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది. చేతికి అంటుకోదు.తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటినిక్ యాసిడ్  లాంటి విటమిన్ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లు అమైనో ఆమ్లాలూ ఎంజైములు ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టి తేనెను బలవర్ధకమైన ఆహారం గా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనెల్లో రంగులు రకాలు ఉంటాయి. పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు... ఇలా భిన్న వర్ణాలు పాటు కొన్ని తేనెలు వర్ణ విహీనంగా ఉంటాయి. అలాగే ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచిని సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. అంటే తేనె రంగు, సువాసన, రుచి... అన్నీ మధు కీటకాలు సేకరించే పూల జాతుల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు యూకలిప్టస్, నిమ్మ, నారింజ పూల నుండి మకరందాన్ని సేకరిస్తే అది ఘాటైన వాసన నీ రుచిని కలిగి ఉంటుంది. చాలామంది వంట లో పంచదార కన్నా తేనె వాడటానికి ఇష్టపడతారు. బేకింగ్ ఉత్పత్తులు తేనె వాడటం వల్ల రుచిగా ఉండటంతో పాటు అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. పైగా ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనె పట్టు నుంచి తీసిన జుంటి తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి.
ప్రకృతి వైద్యంలో తేనె :

కాలిన గాయాలకు చర్మ క్యాన్సర్ లకు పుండ్లకు హనీ రాస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇది 'యాంటీ మైక్రోబియల్' ఏజెంట్‌గా చక్కగా పనిచేస్తుంది.చెడువాసనల్నీ వాపునీ మచ్చల్నీ కూడా మటుమాయం చేస్తుంది.ఎలర్జీని నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అదెలా అంటే స్థానికంగా దొరికే తేనెనే మీరు తీసుకుంటే ఆయా కాలాల్లో వచ్చే ఎలర్జీ లన్నింటినీ తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఎలర్జీ సాధారణంగా పరాగ రేణువు ల వల్ల వస్తాయి. తేనెటీగలు మీ చుట్టుపక్కల ఉన్న మొక్కల నుండి కదా తేనెను సేకరిస్తాయి కాబట్టి ఆ పరాగరేణువులు మీ శరీరంలో చేరి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నమాట.ఊబకాయులు పరగడుపున రెండు టీ స్పూన్ల నిమ్మరసం అర చెంచా తేనెను రంగరించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.తేనెలో ఔషధగుణాలున్న నూనెలు, ఫ్లేవోనాయిడ్‌లు, టెర్పీన్లు, పాలీఫినాల్‌లు ఉన్నాయి. ఇవి అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు- క్యాన్సర్, హృద్రోగాలు అడ్డుకుంటాయి.మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు తినడం వీలైనంతగా తగ్గించాలి. అయితే వీళ్లు అందుకు బదులుగా తేనెను తిన్నా బ్లడ్‌షుగర్ ఎంతమాత్రం పెరగదు. తేనె రక్తప్రవాహంలో మెల్లమెల్లగా కలుస్తూ ఇన్సులిన్ తయారీ నిరోధిస్తుంది.పూర్వం మశూచికం వల్ల ఏర్పడ్డ మచ్చలు త్వరగా తగ్గేందుకు చైనీయులు తేనె మందుగా వాడేవారు.అమృతప్రాయమైన మధువులో రవ్వంత విషం ఉంటుంది. మకరందంలో సహజంగా ఉంటే బ్యాక్టీరియా బాట్యులిన్ అనే టాక్సిన్‌ను విడుదల చేస్తాయి. ఈ విషం క్యాన్సర్, మల్టిపుల్‌స్ల్కిరోసిస్‌కు మంచి మందు. అదే విషం ఏడాదిలోపు పసిపిల్లలకు హానికరం.అజీర్తికి విరేచనాలు తేనె దివ్యమైన మందు.తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్ల రసాలు తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.రోజు ఉదయాన్నే (పరగడుపున) స్పూన్ నిమ్మరసం, మిరియాల పొడి, తేనే వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది...తేనెను వేడి నీ