కళ్యాణ లక్ష్మి నిరుపేదల పెళ్లికి మనోస్థైరం

Published: Wednesday July 14, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్ : కల్యాణ లక్ష్మి నిరుపేదల పథకమని కార్పొరేషన్ మేయర్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 85 మంది (85,09,860 రూపాయలు) లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను కార్పోరేషన్ కార్యాలయంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, బాలాపూర్ మండల ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యుల చేతులమీదుగా సోమవారం నాడు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..... కల్యాణ లక్ష్మీ పథకం నిరుపేదల పథకం అని అన్నారు. సీఎం కేసీఆర్ నేరుగా లబ్ధిదారులకు చేరేలా చేయడం వారి దూరదృష్టికి నిదర్శనం అని అన్నారు. కల్యాణలక్ష్మీ పథకం నిరుపేదల పెళ్ళికి మనోస్థైరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఇ అశోక్ రెడ్డి, ఏఈ బీక్క నాయక్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు, పెద్ద బావి శోభ ఆనంద్ రెడ్డి, స్వప్న జంగారెడ్డి, సం రెడ్డి వెంకట్ రెడ్డి, తోట శ్రీధర్ రెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, దడిగా శంకర్, ఇంద్రసేన, ముత్యాల లలితా కృష్ణ, బొద్ర మో ని రోహిణి రమేష్, పద్మ ఐలయ్య యాదవ్, మాధురి వీర కర్ణ రెడ్డి, శివ కుమార్, భారతమ్మ కొమరయ్య, పవన్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.