ఘనంగా నిర్వహించిన భారత జాతీయ పతాక ఆమోద దినోత్సవం-లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ శాఖ

Published: Saturday July 23, 2022

రాయికల్, జూలై 22( ప్రజాపాలన ప్రతినిధి):
లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జ రిగింది.  కార్యక్రమంలో అధ్యక్షుడు దివాకరరెడ్డి మాట్లాడుతూ మూడు రంగుల భారత జాతీయ పతాకాల్ని పింగళి వెంకయ్య రూపొందించారు. పైన కాషాయం మధ్యలో తెలుపుక్రింది భాగాన ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో అశోక చక్రం ఉంటుందని,భారత జాతీయపతాకాన్ని జూలై 22 -1947 సం. భారత రాజ్యాంగఅసెంబ్లీలో ఆమోదించారు. కావున ఈరోజు భారత జాతీయ పతాక ఆమోద దినోత్సవంగా జరుపుకుంటామని వివరించినారు. ఈ కార్యక్రమంలో డిసి బత్తినిభూమయ్య, కాటిపల్లి రామిరెడ్డి, ప్రధానకార్యదర్శి కొత్తపల్లి రంజిత్ కుమార్, క్యాషియర్ కడకుంట్ల నరేష్, సభ్యులు మరిపెళ్లి శ్రీనివాస్ గౌడ్, మామిడాల నాగభూషణం, కడకుంట్ల జగదీశ్వర్, సుధవేని మురళి గౌడ్, కట్ల నర్సయ్య, మొసరపు శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.