రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

Published: Thursday May 06, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ మే 05 ప్రజాపాలన బ్యూరో : తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని పుష్ప గుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం హైదరాబాదులోని మంత్రి నివాసానికి వెళ్లి మొక్కను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యేతో పాటు చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఏఎంసి చైర్మన్ విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ళపల్లి రమేష్ కుమార్, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, రాములు, నాయకులు రామ్ రెడ్డి, నర్సింహ రెడ్డి ఉన్నారు.