జర్నలిస్టు సోదరులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

Published: Monday May 17, 2021

బిజెపి నాయకులు శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం 
కరోనా వ్యాధి విజృంభిస్తున్న సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు, సమాజానికి ఎన్నో విషయాలు తెలియపరుస్తున్నరని. వ్యాధి సోకినపుడు పాటించాల్సిన జాగ్రత్తలు మీడియా ద్వార ప్రజలకు తెలియపరుస్తు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది జర్నలిస్టులు కరోనా బారినపడి చనిపోతున్నారని బీజేపీ నాయకులు శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు, ఆయన మాట్లాడుతూ అలాంటి జర్నలిస్టు సోదరుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఒక్కొక్క కుటుంబానికి 50,00,000 యాభై లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సోదర సోదరి మణులను ఫ్రంట్ లైన్ వరియర్స్గా భావించి అందరికీ  కోవిడ్ వాక్సిన్ ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు, సమాజానికి సేవ చేయాలనే మంచి ఆశయం కోసం మీడియా రంగంలో పనిచేస్తున్న సమాచార సేవల ద్వారా సమాజ నిర్మాణానికి ఎంతగానో తోడ్పాటును అందిస్తున్న జర్నలిస్టులను నేటి కరోనా కష్టకాలంలో కూడా తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇటువంటి వారిని ప్రభుత్వం అన్నివిదాలుగా ఆదుకొవలని డిమాండ్ చేస్తున్నమని, ఇప్పటికే పలువురు విలేకరులు చనిపోవడం బాధాకరం. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ ఉద్యమం సమయం లో మరియు ఎన్నికల ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలైన ఉచిత ఇల్లు, ఉచిత హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైనది. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు తగు న్యాయం చేయాలని, లేనిపక్షంలో రానున్న రోజులలో జర్నలిస్టు మిత్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వన్నీ  హెచ్చరించారు