పేదవాడి ఆకలిని తిరుస్తూ, ఆరోగ్యాన్ని కాపాడే మోడీ పథకాలు

Published: Wednesday June 09, 2021
మల్లాపూర్ మండల బిజెపి అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ గౌడ్
మల్లాపూర్, జూన్ 07 (ప్రజాపాలన ప్రతినిధి) : దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన అందరికీ జూన్‌ 21 నుంచి ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా పేదలకు ఉచిత రేషన్‌ అందించే పథకాన్ని నవంబర్‌ వరకు పోడగిస్తున్నామని వెల్లడించారు. ఈ పథకాలు నిరుపేదలకు ప్రయోజనంగా ఉన్నాయని మల్లాపూర్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద ప్రజలకు మేలు చేసే పథకాలు అవడంతో కృతజ్ఞతగా మంగళవారం బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ఓ నిరుపేద కుటుంబ సభ్యుల చేతుల మీదుగా నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అధ్యక్షులు మాట్లాడుతూ ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున ఆహారధాన్యాలు ఉచితంగా అందుతాయని ఈ పథకం దీపావళి వరకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం పేదలకు ఒక స్నేహితుడిగా అండగా ఉంటుంది అని ప్రధాని మోదీ పేర్కొనడం ఎంతో ఆనందదాయకంగా ఉన్నందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు లవంగ శివకుమార్, బీజేవైఎం మండల ప్రధానకార్యదర్శి ముత్యాల రాకేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు నాగుల నవీన్ గౌడ్, బిజెపి పార్టీ ప్రధానకార్యదర్శి ఇలేందుల మనోజ్, బిజెపి నాయకులు బెజారపు సంతోష్, ఎర్ర రాజు, బజరంగ్ దళ్ సభ్యులు బండి జైపాల్ గౌడ్, బిజెపి మహిళా మోర్చ జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మి, మహిళా మోర్చ మండల నాయకులు అంజమ్మ మరియు నాయకులు నిరుపేద కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.