ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి. *భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అ

Published: Wednesday September 07, 2022

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లోని   బండ రావిరాల సర్వేనెంబర్ 268లో భూములు కోల్పోయిన రైతులకు భూమికి భూమి, లేదా ఉన్న స్థలం ఇవ్వాలని గత 22 రోజులుగా దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య . ముఖ్య అతిథులుగా విచ్చేసి రైతులు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని. తుద కంట వరకు  మీ పోరాటానికి సిపిఎం పార్టీ వెన్నంటి ఉంటుందని. ఈ ప్రభుత్వం దిగివచ్చి రైతులకు నష్ట పరిణయం ఇచ్చేంతవరకు పోరాటం చేయాలని, అన్నారు. ఇట్టి విషయంలో ముఖ్యమంత్రి  చొరవ తీసుకొని , పోరాటం ఉదృతం కాకుండా రైతులను ఆదుకోవాలని, రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా, ఈ మండలానికి ఎమ్మెల్యే మంత్రులు ఎవరు ఇచ్చిన అడ్డుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను నట్టేట ముంచుతూ, వారి పొట్ట కొట్టి రోడ్డున పడేస్తుందని, అన్నారు. లేనియెడల రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా చేయాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ, గుండె శివకుమార్, ప్రారంభ శ్రీనివాస్, ఇరుగు బిక్షపతి,  మహేష్ పాల్గొన్నారు. రైతులు, నర్సింగ్ రావు నీతి కృష్ణ. మల్లయ్య ఐలయ్య వందలాది మందిని రైతులు పాల్గొన్నారు.