ఐక్య ఉద్యమాల ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారం... సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమోహన్

Published: Wednesday September 14, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి.
మంచాల మండలం అగపల్లిలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల యూనియన్ 3వ మండల మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఐక్య ఉద్యమాల ద్వారానే తమ సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని ఆ ఉద్యమ ఫలితాలే గ్రామపంచాయతీ విద్యా కార్మికులకు పెరిగిన వేతనాలు జీవో వచ్చిందని చెప్పారు.  అయినా ఇంకాగ్రామాల్లో గ్రామపంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా సేవలు చేస్తున్న వారి సమస్యలు పరిష్కరించలేదన్నారు. కార్మికులకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఐకమత్యంగా ఉద్యమాలు చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 51ని సవరించి ప్రతి కార్మికుడికి 8500/- రూపాయల వేతనం ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి. ప్రతి గ్రామపంచాయతీ కార్మికుడికి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సి వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. పల్లె ప్రగతి విజయవంతం గ్రామపంచాయతీ కార్మికుల పాత్ర కీలకమని తెలిపారు. కనుక గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. సిఐటియు మండల కార్యదర్శి పోచమోని కృష్ణ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతి ఆదివారం, ప్రతి పండుగ రోజున ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ సెలవు రోజులలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు కూడా సెలవులు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షురాలుగా శంకరయ్య మండల అధ్యక్షులుగా ఖాజా పాషా మండల కార్యదర్శిగా భాస్కర్, కోశాధికారిగా బి శంకరయ్య, ఉపాధ్యక్షులు రవి సురేష్ జంగయ్య సహాయ కార్యదర్శిగా జి సురేష్ కే జగన్ దేవదాస్ పేరుతో పాటు 25 మంది తో కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది ఇవ్వడం జరిగింది.