నాగర్ గూడ గ్రామ పంచాయతీని నూతన మండలంగా ఏర్పాటు చేయాలి. -అఖిలపక్ష నాయకులు డిమాండ్.

Published: Monday October 10, 2022
 చేవెళ్ల అక్టోబర్ 09:(ప్రజా పాలన)   
      
చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం  నాగర్ గూడ గ్రామ పంచాయతీని నూతన మండలం గా ఏర్పాటు చేయాలని, చాలా తక్కువ సమయంలో   అభివృద్ధి చెందుతున్న నాగర్ గూడా గ్రామానికి  చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రోజుకు ఒకసారైనా  అవసరం నిమిత్తం వస్తూ పోతూ ఉంటారు  చుట్టుపక్కల గ్రామాలకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కలిగిన నాగర్ గూడ  గ్రామాన్ని  నూతన మండలంగా ప్రకటిస్తే బాగుంటుందని  చుట్టూ గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారని    అఖిలపక్ష నాయకులు డిమాండ్ వ్యక్తం చేసారు.    షాబాద్ మండలాన్ని రెండు మండలాలుగా ఏర్పాటు చేయాలని నాగర్ గూడ గ్రామ పంచాయతీని నూతన మండలంగా ఎర్పాటు చెయ్యడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆదివారం  పోతుగల్ గ్రామంలో అఖిలపక్ష నాయకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల అందరి అభిప్రాయం మేరకు    ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి భార్గవ రామ్ షాబాద్ మండల్ TRS మాజీ కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ అయ్యుబ్ ,కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకులు ప్రజా సంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు పామేన నర్సింలు ,పిరంపల్లి యాదయ్య , సయ్యద్ షబ్బిర్ ,కార్ల జగన్ ,నాగర్కుంట మహెందర్ , కావలి మానిక్యం ,అడ్వకేట్ బండి ప్రభాకర్ , కామరెడ్డి శ్రీనివాస్ ,బర్తాగి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు