ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏ

Published: Wednesday November 02, 2022
మెట్రో న్యూస్,ఇబ్రహీంపట్నం:ఇప్పటికే పంట కోతలు పూర్తయి ధాన్యం రోడ్లపైనే ఉందని రైతులు నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీటీడీపి నియోజకవర్గ ఇంచార్జి చింతకింది చక్రపాణి డిమాండ్ చేశారు. నియోజవర్గ కేంద్రంలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీటీడీపి నియోజకవర్గ ఇంచార్జ్ చింతకింది చక్రపాణి మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా అమానుషమని,  ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో వరి పంట కోతలు రైతులు పూర్తి చేశారని,  అయినా కానీ ప్రభుత్వం రైతులకు ధాన్యానికి బస్తాలు ఇవ్వకపోవడం,కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపైనే ధాన్యాన్ని ఉంచి రైతుల దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.దీనికి తోడు ఈ అకాల వర్షాలతో అనేక ప్రాంతాల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిందని, వెంటనే ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి  రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి పూర్తి ధాన్యాన్ని కొనాలని, ప్రతి ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రైతులకు పంట చేతికోచ్చేటప్పటికి  వర్షాలు పడడంతో  రైతులు పూర్తిగా నష్టపోయారని వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు.