మహాగణపతికి 60 అడుగుల కండువా, జంజెం సమర్పించినున్న ఖైరతాబాద్ పద్మశాలి సంఘం. వేదమంత్రాలు, డప్పు

Published: Monday August 29, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
 ఖైరతాబాద్ లో కొలువుతీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతికి ప్రతి ఏడాదిలాగే  ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 60 జందెం, కడువ, గారిక మాలను అందించన్నారు.  పార్వతీ తనయునికి సమర్పించనున్న పట్టు వస్త్రాలు జంధ్యం, కండువాలను పద్మశాలి సంఘం అధ్యక్షుడు కడారి శ్రీధర్, ఏలే స్వామి గుర్రం కొండయ్యలు ఆదివారం ప్రదర్శించారు. వేద మంత్రాలు, డప్పు వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను స్వామివారి వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రత్యేక గుర్రపు బగీలో పట్టు వస్త్రాలను ఊరేగింపుగా స్వామివారి చెంతకు తీసుకువస్తామని చెప్పారు. జంధ్యాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమర్పిస్తారని చెప్పారు. 60 అడుగుల నూలు కండువాను మాజీ హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవిలు, గారిక మాలను గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్ లు సమర్పిస్తారని చెప్పారు.  పట్టు వస్త్రాలను సంఘం తరపున సమర్పిస్తామని తెలిపారు. నాగరికతకు బాటలు వేసిన పద్మశాలీలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణనాధుడికి ప్రతి ఏడాది ఇదే తరహా వస్త్రాలను అందించాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైభవోపేతంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.