అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు

Published: Monday September 05, 2022
ఖమ్మం నగరం సెప్టెంబర్ 4 ప్రజాపాల నప్రతినిధి విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లింగాల రవికుమార్ వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు మెదక్ డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు ఖమ్మం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ రాంబాబు పేర్కొన్నారు. తిరుమలాయ పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెడ్ నర్స్ గా పనిచేసి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసిన తప్పిట స్వర్ణ స్వరూపకి ఆదివారం స్థానిక గ్రాండ్ గాయత్రి హోటల్లో ఘనంగా పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ 32 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో పనిచేసి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన స్వర్ణ స్వరూప సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వైద్య వృత్తి అనేది ఎంతో పవిత్రమైదన్నారు. 32 ఏళ్లలో అనేకచోట్ల విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందజేశారని వారు గుర్తు చేశారు ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పుడే పదవి విరమణ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నారు. స్వర్ణ స్వరూప శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని వారు ఆకాంక్షించారు
అనంతరం స్వర్ణస్వరూప నాగేశ్వరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ లింగాల కనకరాజు న్యాయవాదుల సంక్షేమ సంఘం కార్యదర్శి పాముల దానయ్య మద్దెల జయరాజు వేముల దిద్దిబాబు రామాల నాగభూషణం చింతమాల  ఆశీర్వాదం డాక్టర్ శ్రీకాంత్ మధిర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాగి బాలస్వామి డోర్నకల్ డయాసిస్  పాస్టేట్ సెక్రటరీ లింగాల జ్యోతి మోహన్ రావు, తప్పేట విజయరాణి, జ్యోతి వినయ్, కవిత అమర్ల పూడి సురేష్ కల్పన,పి నాగేశ్వరావు స్వర్ణ స్వరూప కుమారుడు కోడలు సాత్విక్ మౌనిక