జోగన్ పల్లి లోన్యాయ విజ్ఞాన సదస్సు

Published: Thursday October 07, 2021
 కోరుట్ల, అక్టోబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) : భారత దేశం స్వాతంత్ర్యం సాధించి 75 వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీం కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశానుసారం ఆజాద్‌ కె అమృత్‌ మహోత్సవ్‌ అనే కార్యక్రమం ద్వారా దేశంలో ఉన్న ప్రతీ మారుమూల గ్రామంలో ఉన్న సామాన్య ప్రజానీకానికి చట్టాల పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశ్యంతో ప్రతీ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చెయ్యాలని జిల్లా జడ్జి సూచనల మేరకు, కోరుట్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్యామ్‌ కుమార్‌ ఆదేశాల ప్రకారం కోరుట్ల మండలం లోని జోగన్ పల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో న్యాయవిజ్ఞాన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు వినియోగదారుల రక్షణ చట్టం, ప్రాంసరి నోట్, వృద్ధులా సంక్షేమ చట్టం మద్యపానం గురించి ఆస్తిబధలాయింపుల చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల తహసీల్దార్ సత్యనారాయణ, సిఐ రాజశేఖర రాజు, ఎస్ఐ సతీష్, కోరుట్ల మండల న్యాయవిజ్ఞాన సదస్సు ఇంచార్జి మరియు బార్‌ అసోసియేషన్‌ కోరుట్ల సెక్రటరీ బైరి విజయ్‌ కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కడకుంట్ల సదాశివరాజు, కోరుట్ల కోర్ట్‌ ప్రభుత్వ న్యాయవాది కటుకం రాజేంద్రప్రసాద్‌, బార్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ కొంపల్లి సురేష్‌, న్యాయవాది ప్రేమ్ సాగర్, ముఖరం, గ్రామ సర్పంచ్‌ దుంపల నర్సు రాజా నర్సయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.