11 వ పి ఆర్ సి ని అమలు చేయాలి

Published: Friday September 02, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 01, ప్రజాపాలన:  
 
11 వ పిఆర్ సిని అమలు చేయలాని
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే , పిఏ కు గురువారం రోజున వినతిపత్రం అందజేశారు.   ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో  వివిధ కేటగిరిలో పని చేస్తున్నా ఎంప్లాయిస్, వర్కర్స్ పలు సమస్యలు పరిష్కరించాలని,  గ్రామ పంచాయతీ సిబ్బందికి మున్సిపల్ కార్మికుల వలే వేతనాలు పేంచి, జివో నెంబర్ 4 ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు అమలు  చేయాలని, జివో  నెంబర్ 51 ని సవరించి, మల్టీపార్పస్ విధానాన్ని రద్దు  చేసి, 2 లక్షలు ఇన్సూరెన్స్, పే ఎఫ్, ఇ ఎస్ ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు.8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ రాజలింగు, లింగయ్య, సాయి కృష్ణ,లచ్చయ్య, మొండయ్య, మొగిలి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.