కరెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి.

Published: Saturday July 23, 2022

ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం కరెంట్ ఏడి ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది.ఈ ధర్నా కు ముఖ్య అతిధులుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుస్సు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ... మండలంలోని తులేకాలన్ గ్రామంలోని పంబలి లక్ష్మమ్మ యొక్క  ఆవు కరెంట్ షాక్ కు గురై చనిపోవడం జరిగింది. గతంలో కూడ ఇలాంటి ఘటనల వల్ల మూగ జీవులు చనిపోయాయని ఎన్ని సార్లు కరెంటు అధికారులకు విన్నవించిన నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు అని అన్నారు ట్రాన్స్ఫరం చుట్టూ ఎలాంటి కంచె లేకపోవడంతో ప్రమాద హెచ్చరిక గుర్తులు లేకుండా ఉండటంతో ఈ ప్రమాదాలు జరిగుతున్నాయు కావున ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కరెంటు అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని కరెంట్ అధికారి ఏడి కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది... ఈ కార్యక్రమంలో  సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. సామెల్,జగదీష్,మండల కార్యదర్శి చేత ల్ల. జంగయ్య,డి. గణేష్, రమేష్, భాస్కర్, రమేష్, సంజీవ,యాదగిరి,మైసయ్య, రాజు, జంగయ్య, లక్ష్మమ్మ, పాండు, మహేష్, శివ, ప్రవీణ్, నర్సింహా, దాసు, తదితరులు పాల్గొన్నారు.