పట్లూర్ లో వైకుంఠధామం నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

Published: Thursday March 18, 2021
మర్పల్లి మండలం ఎమ్మార్వో తులసీరామ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చ్ 17 ( ప్రజాపాలన ) : మార్చి మాసాంతం వరకు వైకుంఠధామం నిర్మాణ పనులను పూర్తి చేయాలని గ్రామ సర్పంచ్ ఇందిర అశోక్ కు మర్పల్లి మండలం ఎమ్మార్వో తులసీరామ్ సూచించారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలానికి చెందిన ఏలూరు గ్రామంలో వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠధామం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎండల ముదురుతున్న కారణంగా ఉదయం సాయంత్రం వేళల్లో కూలీల సంఖ్య పెంచి నిర్మాణ పనుల్లో వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పట్లూర్ గ్రామ సర్పంచ్ ఇందిర అశోక్ స్పందిస్తూ ఎస్సీ కాలనీ సమీపంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 420 లో వైకుంఠధామం నిర్మాణానికి అధికారులు స్థలాన్ని సూచించారు. ఎస్సీ కాలనీకి సమీపములో వైకుంఠధామం నిర్మిస్తే శవాలను దహనం చేసేటప్పుడు దుర్వాసన వెదజల్లి ఎస్సీ కాలనీ వాసులు అనారోగ్యం పాలవుతారని పై అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ సర్పంచ్ ఇందిర అశోక్ పలు దఫాలుగా సంబంధిత అధికారులతో చర్చలు జరిపి వైకుంఠధామం నిర్మాణానికి మరొకచోట స్థలాన్ని చూపాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన అధికారులు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 248 లోని పట్లూర్ తాండ ( కట్టేపాడ్ తాండ ) కు సమీపంలో వైకుంఠధామం నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు పట్లూర్ తాండ సమీపంలో వైకుంఠధామం నిర్మాణ పనుల కొరకు పునాది బేస్మెంట్ నిర్మించామని వివరించారు.