ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

Published: Thursday November 10, 2022

రాయికల్, నవంబర్  09 (ప్రజాపాలన ప్రతినిధి):
రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 63 లక్షల రూ.లనిధులతో జిల్లా పరిషత్తు,ప్రైమరీ పాఠశాలల అభివృద్ధికి, తాట్లవాయి గ్రామంలో తెలంగాణతల్లి విగ్రహానికి మరియు 65 లక్షల రూ.ల నిధులతో జిల్లాపరిషత్, ప్రైమరీ పాఠశాల అభివృద్ధికి, భూపతిపూర్ గ్రామంలో 1కోటి రూ.ల నిధులతో జిల్లా పరిషత్,ప్రైమరీ పాఠశాలల అభివృద్ధి పనులకు, రామాజీపేట గ్రామంలో 1కోటి9లక్షల రూ.ల నిధులతో జిల్లా పరిషత్ ,మండల పరిషత్ పాఠశాలల అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత లు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివే విద్యార్థులకు క్వాలిఫైడ్ టీచర్లతో విద్యాబోధనలు చేస్తూ,నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని పేర్కొంటూ కరోనా వల్ల విద్యార్థులకు విద్య విషయంలో ఎక్కువ నష్టం జరిగిందని, పాఠశాలలను బలోపేతం చేసి అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  జెడ్పిటిసి అశ్విని జాదవ్,వైస్ ఎంపీపీ,ఫ్యాక్స్ చైర్మన్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ప్రభుత్వ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.