*గ్రామాల అభివృద్దే దేశానికి వెన్నుముక* - పట్టణాలకు దీటుగా గ్రామాల. అభివృద్ధి. - గొల్లగూడ, మల్ల

Published: Friday February 03, 2023

చేవెళ్ల ఫిబ్రవరి 2(ప్రజాపాలన):-

గ్రామాల అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధి గొల్లగూడ, మల్లారెడ్డిగూడ గ్రామాల్లో నూతన పంచాయతీ భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన పంచాయతీలుగా ఏర్పడ్డ గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఒక్కో నూతన పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేసి వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నూతన పంచాయతీ భవన నిర్మాణలకు గాను రూ.16.52 కోట్లు, అందులో చేవెళ్ల మండలానికి రూ.4.38 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తున్న ఏకైక సీఎం మన కేసీఆర్‌ అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. అలాగే ఎర్రోని కొట్టాల గ్రామంలో పది లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్‌, ఎంపీటీసీ కావలి రాములు,బీఆర్‌ఎస్ నియోజకవర్గ యూత్‌ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్‌రెడ్డి, గొల్లగూడ సర్పంచ్‌ రాంచందర్‌, మల్లారెడ్డి గూడ సర్పంచ్ మోహన్‌రెడ్డి,  బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు  పెద్దోళ్ల ప్రభాకర్‌, సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శేరీ శివారెడ్డి, బీఆర్‌ఎస్ మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు ఎదిరె రాములు, సివిల్‌ సప్లె జిల్లా సభ్యులు రవీందర్‌,అబ్దుల్ గని, గడ్డమీద శేఖర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.