ఐటీడీఏ గిరిజన పాలకమండలి సమావేశంలో వైరా నియోజకవర్గ ఏజెన్సీ మండలాల సమస్యలపై చర్చించాలి... సిపి

Published: Friday July 08, 2022

డిమాండ్* *వైరా:-7-7-2022,* నేడు ఐటిడిఏ భద్రాచలం ఆధ్వర్యంలో గిరిజన పాలకమండలి సమావేశం(8-7-2022)న భద్రాచలంలో జరుగుతున్న సందర్భంగా వైరా నియోజకవర్గ పరిధిలోని ఏజెన్సీ మండలాల్లో దీర్ఘకాలిక సమస్యలపై చర్చించి పరిష్కారానికి తగిన స్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధి కొరకు కృషి చేయాలని సిపిఎం వైరా నియోజకవర్గ ఇంచార్జి భూక్యా వీరభద్రం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కారేపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు, కామేపల్లి, మండలాలతో పాటు జిల్లా లో వివిధ మండలాల నివసిస్తున్న గిరిజన సమస్యల గురించి కూడా పాలకమండలి సమావేశంలో చర్చించాలని కోరారు దీర్ఘకాలిక సమస్య అయిన పోడు భూముల సమస్య, గిరిజన విద్య ,వైద్యం అందని ద్రాక్షల మారిందని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకపోవడంతో గిరిజన విద్యార్థులు విద్యాలో వెనకబడుతున్నారని తెలిపారు. వైద్యం ప్రతి మండలంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఐటీడీఏ ద్వారా ఉపాధి మార్గాలను చూపాలని డిమాండ్ చేశారు గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధి కొరకు ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయించి ఇల్లు లేని ప్రతి గిరిజనుడికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టి అభివృద్ధికి పాటుపడాలని గిరిజన ప్రజాప్రతినిధులను అధికారులు గౌరవించి చట్టబద్ధ హక్కులను కాపాడాలని కోరారు, ఐటిడిఏ పాలకమండలి సమావేశం ప్రతి మూడు నెలలకు ఒకసారి జరపాలని డిమాండ్ చేశారు ఏజెన్సీ గ్రామాల సమగ్ర అభివృద్ధికై ప్రణాళిక రూపొందించి ముందుకు సాగాలని సూచించారు