బంగారు తెలంగాణ కాదు బతుకు తెలంగాణ కావాలి : మల్లేశ్వరి

Published: Tuesday July 13, 2021

మధిర, జులై 12, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని బతుకు తెలంగాణ కావాలని జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కుంచం మల్లేశ్వరి అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఆత్మహత్యలే మిగిలాయని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో పసి పిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే షీ టీమ్ లు ఎక్కడ ఉన్నాయని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో కొత్తగా 50 వేల కొలువులు భర్తీ ఏమో కానీ ఈ మూడున్నర ఏళ్లలో 52 వేల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డును పడవేసింది. దీంతో వేలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం 52,515 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. వీరిని ఎప్పుడు, ఎందుకు తీసి వేశామని సమాచారం కూడా ఇవ్వకుండా ఉద్యోగాల నుండి ఊడ పీకింది. వైద్య శాఖలో 1640 మంది స్టాఫ్ నర్సు లను తీసివేయడం దారుణమని అన్నారు. కరోనా విజృంభించిన వేళ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కరోనా రోగులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించిన వారిని తొలగించటం హేయమైన చర్య అని వారిని ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరికి న్యాయం జరిగే వరకూ బిజెపి అండగా ఉంటుందని జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కుంచం మల్లేశ్వరి తెలిపారు. ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇవ్వాలని చిత్తశుద్ధి లేదని ఉద్యోగాలను కొట్లాడి సాధించుకోవాలని నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని కుంచం మల్లేశ్వరి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల ఓట్ల కోసం వరాలు కల్పించే సంస్కృతిని మాని నిరుద్యోగులను మోసం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలని మరియు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.