ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Published: Tuesday March 07, 2023
మధిర మార్చి 6 ప్రజాపాలన ప్రతినిధి:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిర నందు తెలుగు విభాగం మరియు లియో క్లబ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. మరియు మహిళా ఉద్యోగులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏఎల్ ఎన్ శాస్త్రి గారు, తెలుగు విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఇందిర, ఎస్.కె అప్రోజ్, పి లక్ష్మీనారాయణ, డాక్టర్ కె వీరన్న, ఆఫీస్ సిబ్బందిsk. అఫ్జల్, పుణ్యవతి, నాగలక్ష్మి, హరినాథ్ బాబు మొదలైన వారు పాల్గొన్నారు.