తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Published: Wednesday February 02, 2022
జన్నారం రూరల్, పిబ్రవరి 01, ప్రజాపాలన : జన్నారం మండల అధ్యక్షులు పాలాజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ కార్మికుల సంక్షేమ సమితి మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు, సోమవారం రాత్రి అయన మాట్లాడుతూ జన్నారం మండల కేంద్రంలో రాంపూర్ రోటిగూడా పొనకల్ కామన్ పల్లి గ్రామాలలో కోవిడ్- 19 నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేసి గల్ఫ్ కార్మికులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు, ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి దుమ్మల ఎల్లయ్య మాట్లాడుతూ టిజిడ్ల్యూడ్లూసి ఈ రెండు సంవత్సరాలలో అనేక సేవా కార్యక్రమాలు ద్వారా గల్ఫ్ కార్మికులకు ఎన్నో సేవలు అందించామని కాని తెలంగాణ రాష్ట్రం ఎర్పడి ఎనిమిది సం//లు అవుతున్న కుడా ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సమస్యలను నేరవేర్చడంలేదు, గల్ఫ్ కార్మికుల కోసం అసెంబ్లీ సమావేశాల్లో 500 కోట్ల రూ//ల బడ్జెట్ ఏర్పాటు చెయ్యాలి, ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జునుగురి వెంకటేష్, సింగపూర్ ప్రెసిడెంట్ కోడిజుట్టు నరేష్, కామన్ పల్లి అసోసియేషన్ సభ్యులు కందుల శ్రీను, జునుగురు రామన్న, పోన్కల్ గ్రామ కమిటీ సభ్యులు మర్రిపెల్లి అంజయ్య, జంగ తిరుపతి, బోయిని శేఖర్, రోటిగూడ గ్రామ కమిటీ, సౌదీ అరేబియా అధ్యక్షులు ఉప్పు సురేష్, మల్లారెడ్డి, నాగేష్ , మహేష్, తదితరులు పాల్గొన్నారు.