త్రాగు నీరు కలుషితం కాకుండా చూడాలి

Published: Wednesday September 15, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో, 14 సెప్టెంబర్ ప్రజాపాలన : మిషన్ భగీరథ నీటిని కలుషితం కాకుండా చూడాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ "మీతో నేను" కార్యక్రమంలో భాగంగా ఉదయం 07.00 గంటల నుండి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 4, 5వ వార్డుల్లో పర్యటించారు. మీతో నేను పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యలను తొందరగా పరిష్కరించాలని సూచించారు. మిషన్ భగీరథ లీకేజీలకు వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు. నాలుగవ వార్డులో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరెడ్డి పేట్ లోని బావిలో పెరిగిన చెట్లను తొలగించి యధావిధిగా పైకప్పును ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని చోట్ల ప్రమాదకరంగా వేలాడుతున్న పలుచటి విద్యుత్ తీగలను తొలగించి నూతన తీగలను ఏర్పాటు చేయాలన్నారు. నిరుపయోగంగా ఉన్న స్తంభాలను తొలగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగమ్ ముత్తహర్ షరీఫ్, స్థానిక కౌన్సిలర్ పల్గుట్ట ప్రవళిక క్రిష్ణ, టిఆర్ఎస్ యువజన పట్టణ ప్రధాన కార్యదర్శి దత్తు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.