ఆయిల్ పంప్ సాగు గురించి అవగాహన కల్పించిన బి. అనిత

Published: Wednesday February 15, 2023
జన్నారం, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: మండలంలోని రేండ్లగూడ గ్రామంలో రైతులకు ఆయిల్ ఫామ్ తోటల సాగు గురించి మంచిర్యాల డివిజన్ సహాయక వ్యవసాయ సంచాలకులు బి అనిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని రేండ్లగూడ రైతులకు ఆయిల్ ఫామ్ తోటలలో తమిళ్ ఉండే నేలలు తప్ప మిగిలిన అన్ని భూములు ఈ పంటకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటలు ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వ్యవధిలోగల మొక్కలు నాటుడకు అనుకూలమైవిన్నారు. ఎకరానికి 57 మొక్కలు 9 వర్షాలు మూడు మీటర్ల దూరంలో త్రిభుజకార పద్ధతిలో నాటవలనన్నారు. పంట తీసిన నాలుగు సంవత్సరాల నుండి దిగుబడితో ఆదాయం పెరుగుతుందన్నారు. మూడు సంవత్సరాల వరకు ఈ పంట అంతర్ పంటలుగా అన్ని రకాల పంటలు వేసుకోవచ్చుని వివరించారు. గ్రామంలో వేరుశనగ తదితర పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాట్రిక్స్ సీఈవో ఉదయ్ కుమార్, జన్నారం క్లస్టర్ ఏఈఓ ఎం త్రిసంధ్యా, మాట్రిక్స్ మల్లేష్ గ్రామ సర్పంచ్ ఎన్ ఆశరాజ్, రైతులు పాల్గొన్నారు.