పెట్రోల్ ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ వెంటనే తగ్గించాలి

Published: Thursday December 02, 2021

కోరుట్ల, డిసెంబర్ 01 (ప్రజాపాలన ప్రతినిధి): బీజెపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ను తగ్గించి ప్రజలపై పడుతున్న భారం తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుట్ల తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజెపీ పట్టణ అధ్యక్షులు చిరుమల్ల ధనంజయ్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలపై ఇదివరకు ఉన్న ట్యాక్స్ లో గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం కొంత ట్యాక్స్ ను తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతుగా కొంత ట్యాక్స్ ను తగ్గించి తమ చిత్తశుద్దిని చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజెపీ కోరుట్ల పట్టణ అధ్యకులు చిరుమల్ల ధనంజయ్, యూసుఫ్ నగర్ సర్పంచ్ గుగ్గిల్ల తుకారాం గౌడ్, ప్రధాన కార్యదర్శి పోతుగంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బింగి వెంకటేష్, కౌన్సిలర్ మాడవేని నరేష్, జిల్లా కార్యదర్శి సాడిగె మహేష్, కోరుట్ల కార్యదర్శి ఎల్లాల నారాయణ రెడ్డి, ఐటీ సెల్ ఇంచార్జి ఇట్యాల నవీన్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఆకుల రంజిత్, మైనారిటీ నాయకులు మహమ్మద్ తాహెర్, మహమ్మద్ చాంద్ పాషా, బీజేవైఏం కోరుట్ల పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపెల్లి సాగర్, ఉపాధ్యక్షుడు కంటం శ్రీనివాస్, బీజేవైఏం నాయకుడు దమ్మ సంతోష్ లు పాల్గొన్నారు.