కోనా సుబ్బారావు సేవలు మరువలేనివి

Published: Saturday October 15, 2022

మధిర అక్టోబర్ 14 (ప్రజాపాలన ప్రతిని ధి) కోన సుబ్బారావు సేవలు మరువలేనివని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం మధిరలోని కోన జగదీష్ నివాసంలో ఏర్పాటుచేసిన కోనా సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు కోన జగదీష్ ని పరామర్శించారు. ఆయన వెంట టిఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు కనుమూరి వెంకటేశ్వరరావు వైవి అప్పారావు అరిగే శ్రీనివాసరావు కొఠారి రాఘవరావు జేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.