ఉపాధి అవకాశాలను సృష్టించాలి

Published: Saturday December 03, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 02 డిసెంబర్ ప్రజా పాలన : స్వయం ఉపాధి పొందుతూ ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని జీకే మోటార్స్ యాజమాన్యానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. శుక్రవారం మోమిన్పేట్ మండల కేంద్రంలో జెకె బైక్ మోటార్స్ వ్యవస్థాపకుడు ఇజ్రా చిట్టెంపల్లి గ్రామ సర్పంచ్ కాశీరాం ఆధ్వర్యంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్న వ్యవస్థాపనకులకు అభినందనలు తెలిపారు. ఇజ్రాచిట్టంపల్లి సర్పంచ్ కాశీరాం మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురు చూడకుండా స్వయం శక్తితో ఉపాధి అవకాశాలను సృష్టించాలని యువతకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన తమ సంతానం తమ కాళ్ళపై తామే నిలబడే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని మనస్థాపం చెందకుండా ఏదో ఒక పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోమిన్ పేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దబ్బని వెంకట్ తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.