ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Published: Monday December 13, 2021
మేడిపల్లి, డిసెంబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతగానో దోహదపడతాయని కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు, మల్కాజ్గిరీ డీసీపీ రక్షిత మూర్తి పేర్కొన్నారు. మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చిల్కానగర్ ప్రభుత్వ పాఠశాలలో కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు, మల్కాజ్గిరీ డీసీపీ రక్షిత మూర్తి పాల్గొని ప్రారంభించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో వైద్య పరీక్షలు నిర్వహించుకున్న ప్రతి ఒక్కరికీ  తమ కిమ్స్ హాస్పటల్ లో 50 శాతం రాయితీ ఇస్తామని కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ భాస్కర్ రావు. డీసీపీ రక్షిత మూర్తి మాట్లాడుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, సద్వినియోగం చేసుకోవాలని అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత  దురాన్ని అలాగే మాస్క్ లను ధరించాలని అన్నారు. ఇలాంటి మెడికల్ క్యాంప్  నిర్వహించి మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డిని అభినందించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 350 మంది వారికి సంబంధించిన వ్యాధులను చూయింకోన్నారు. కండ్ల పరీక్షలతోపాటు అద్దాలను, మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేకల శివా రెడ్డి, పసుల ప్రభాకర్ రెడ్డి, బై.కరిపీ సంతోష్, మేకల భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజలక్ష్మి, పుప్పల వెంకటేష్, సంజయ్ జైన్, తవిడబోయిన గిరిబాబు సుధాకర్ శెట్టి, డాక్టర్ కులకర్ణి వారి సిబ్బంది పాల్గొన్నారు.