అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు* - పంచాయతీ వ్యవస్థను ఇర్వీర్యం చేస్తున్న టిఆ

Published: Tuesday January 03, 2023
చేవెళ్ల,జనవరి2,(ప్రజాపాలన):-

పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ సర్పంచుల నిధులను దారి మళ్ళిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సున్నపు వసంతం డిమాండ్ చేశారు.
 పంచాయతీ నిధులను దారి మళ్లింపుకు నిరసనగా సోమవారం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమం  తలపెట్టిన దృశ్య   చేవెళ్లలో  మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సున్నపు వసంతం ను  ముందస్తుగా హౌస్ అరెస్టు చేసే పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అదే విధంగా చేవెళ్ల కాంగ్రెస్ నాయకులు పిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, డి సి సి ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, పెంటయ్య గౌడ్, చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, డిసిసి ప్రధాన  కార్యదర్శి యాలాల మహేశ్వర్ రెడ్డి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా సున్నపు వసంతం మాట్లాడుతూ.... ప్రభుత్వం అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని విమర్శించారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నుంచి వచ్చే నిధులను గ్రామపంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లించి రైతుబంధుకు,వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుందని విమర్శించారు. పంచాయతీలకు నిధులు లేక గ్రామాలలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ నీళ్ల వ్యవస్థ అంతా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు గ్రామాల అభివృద్ధి కుంటు పడుతుందని  అన్ని అన్నారు. తెలంగాణలో 18 మంది సర్పంచులు రాజీనామా చేసిన ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉందని దుయ్యబట్టరు.
ఈ కార్యక్రమంలో  చేవెళ్ల ఉప సర్పంచ్ గంగి యాదయ్య, జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి మహమ్మద్ హనీప్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కే సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, సోషల్ మీడియా చేవెళ్ల మండల అధ్యక్షుడు కే మాణిక్యం, తలారం నరసింహులు మల్కాపూర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు*.