కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

Published: Tuesday December 07, 2021
బెల్లంపల్లి, డిసెంబర్ 6, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్, బి ఆర్, అంబేద్కర్ 65వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అమ్రాజుల శ్రీదేవి మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం, రచించిన రాజ్యాంగం వల్లనే దళిత, బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు అమలైనాయని, రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యారంగంలో మనం ముందు ఉన్నామని, ఆయన చేసిన సేవల్ని ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతినిత్యం పోరాడాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యురాలు శ్రీదేవి, మాజీ మునిసిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, మాజీ కౌన్సిలర్అప్జల్, రొడ్డ  తులసి దాస్, పట్టణ ఉపాధ్యక్షులు అడేపు  మహేష్, లెంకల  శ్రీనివాస్, బెల్లంపల్లి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ పోచంపల్లి హరీష్, యూత్ టౌన్ ప్రెసిడెంట్ ఎలుక ఆకాష్, ఎస్సీ సెల్ నాయకులు మేకల శ్రీనివాస్, రామగిరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గొడిసల తిరుపతి, బర్రె మధునయ్య, బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.