సిపియస్ విధానం రద్దు చేయాలి టియస్ యుటియఫ్ ఆధ్వర్యంలో జీపు జాతా

Published: Wednesday December 07, 2022
బోనకల్ ,డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి:
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపుమేరకు టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో సిపిఎస్ విధానం రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, నూతన విద్యా విధానం 2020 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జీబు యాత్ర గురువారం బోనకల్ మండలంరో జరిగింది. ఈ సందర్భంగా టియస్ యుటియఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి.నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి వల్లంకొండ. రాంబాబు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యతనుండి ప్రభుత్వాలు తప్పుకోవడానికి సిపిఎస్ అనే పథకాన్ని తీసుకొచ్చాయని, ఈ నూతన పెన్షన్ పాలసీ వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనీస పెన్షన్ కూడా రాని దుస్థితి వచ్చిందని వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం 2020 ని రద్దు చేయాలని , రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే లౌకిక, ప్రజాస్వామ్య ,శాస్త్రీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.ఈ జాతా మండలం లోని బ్రాహ్మణపల్లి రావినూతల ముష్టికుంట్ల ఉన్నత పాఠశాలల గుండా కొనసాగింది.ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి నాగూర్ వలి జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఏ .కోటేశ్వరరావు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బీ.ప్రీతం,గుగులోతు రామకృష్ణ, ఎంసీఆర్ చంద్రప్రసాద్ బి సౌభాగ్య లక్ష్మి కె రమేష్ పి గోపాలరావు కే శ్రీనివాసరావు పీ నరసింహారావుపి.పి.పుల్లారావు,రంజాన్అలీ,న‌‌సీమా,సుజాత,కె.సౌభాగ్య లక్ష్మి, శ్రీలక్ష్మి రాఘవాచార్యులు టి లక్ష్మి సీనియర్ నాయకులు సదాబాబు పివీ అప్పారావు,అన్ళంనాయుడు తదితరులు పాల్గొన్నారు.