జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆందోళన.

Published: Thursday April 28, 2022
వరి రైతును మోసం చేసిన కేసీఆర్ ఎకరానికి 25వేలు ఇవ్వాలని డిమాండ్.
మంచిర్యాల బ్యూరో, ఎప్రిల్ 27, ప్రజాపాలన: ముఖ్యమంత్రి కేసిఆర్ మాటలకు నమ్మి వరి వేయకుండా నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో బుధవారం  జిల్లా కలెక్టర్  కార్యాలయం ఆందోళన చేపట్టారు. పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని ఏవో కు అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ మాటలు నమ్మి రాష్ట్రంలోని రైతులు వరి వేయకుండా తీవ్రంగా నష్టపోయారని అన్నారు, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి రెండు వారాలు గడుస్తున్న ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు చేతికి వచ్చిన పంట అమ్ముకొలేని పరిస్థితి లో ఉన్నారని అన్నారు. వడ్ల కొనుగోళ్ల సమయంలో ప్రతి బస్తా పై తాలు, తేమ పేరుతో కట్టింగులు చేయకుండా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, సరిపడా హమాలిలు, లారీలు, త్రాగు నీరు, కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, రజినిష్ జైన్, మోటపలుకుల తిరుపతి, బియ్యాల సతీష్ రావు, ఆకుల అశోక్ వర్ధన్, బోలిషెట్టి తిరుపతి, చల్ల విశ్వంభర్ రెడ్డి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ముదాం మల్లేష్, జోగుల శ్రీదేవి, గాజుల ప్రభాకర్ పల్లి రాకేష్, రాచకొండ సత్యనారాయణ, బల్ల రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.