ప్రైవేటు టీచర్ను ఆదుకోవడం లో విఫలమైన ప్రభుత్వం.

Published: Friday April 30, 2021
మధిర, ఏప్రిల్ 29, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు టీచర్లను ఆదుకునే పేరుతో  ప్రతీ ప్రైవేట్ టీచర్ కి రెండు వేల రూపాయల, 25 కేజీల సన్నబియ్యం ఇస్తామంటూ ప్రకటన చేసి రేషన్ బియ్యం అంటకట్టి.. అది అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.. మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓట్ల కోసం సీట్ల కోసం ప్రైవేట్ టీచర్లకు ఆశలు చూపి మోసం చేసిన ప్రభుత్వం... కొంత మంది ప్రైవేట్ టీచర్లకు ఇచ్చి మరి కొందరికి ఇవ్వని పరిస్థితి.. ప్రైవేట్ టీచర్లు సహాయమందిన వాళ్లు వందల్లో ఉన్నారు.. కానీ ఇంకా సహాయం అందనివాళ్ళూ వేలల్లో ఉన్నారు.. ఇలాగే కాలేజీ ఉపాధ్యాయుల గురించి ఇంతవరకు స్పష్టత లేదు.. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొండివైఖరి విడిచి ప్రవేట్ టీచర్లందరికీ ఆర్థిక సహాయం అందించాలి.. అలాగే కాలేజీ ఉపాధ్యాయులకు కూడా సహాయం చెయ్యాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.