పొంగిపొర్లుతున్న చెరువుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి

Published: Wednesday July 27, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 26 జూలై ప్రజా పాలన :
భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాలర్లను,  ప్రజలను చెరువులలోకి అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులు ఆదేశించారు.
మంగళవారం జిల్లాలో కురుస్తున్న వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు,  చెరువులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్,  పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ చెరువుల వద్ద పొంగిపొర్లుతున్న వాగుల వద్ద ప్రజలు గుమిగూడ కుండా ఇళ్లల్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదకర దశలో ప్రవహిస్తున్న గ్రామాల చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకూడదని టామ్ టామ్( చాటింపు ), మైకుల ద్వారా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 24 రోడ్ల పరిధిలలో 31 స్థలాల్లో అధికంగా నీరు ప్రవహిస్తున్నట్లు  కలెక్టర్ తెలిపారు. ఇటువంటి రోడ్ల వద్ద భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఎబ్బనూరు చెరువు దగ్గర రోడ్డుకు  అతి సమీపంలో పెద్ద మొత్తంలో వరద ప్రవహిస్తున్నందున గ్రామానికి వెళ్లే రోడ్డు దెబ్బ తినే అవకాశం ఉన్నందున చెరువు నుండి అధికంగా నీరు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత 
ఏఇ ని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాద స్థాయిలో పొంగిపొర్లుతున్న చెరువుల వద్ద పోలీసు గస్తిని ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులు కలెక్టర్ ఆదేశించారు. దన్నారం వాగును పరిశీలించిన కలెక్టర్ రోడ్డుపై వరద పొంగిపొర్లుతున్నందున కల్వర్టు దగ్గర  చెత్తాచెదారాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఇన్చార్జి డిఆర్వో విజయ కుమారి, వికారాబాద్ డిఎస్పి సత్యనారాయణ, దారూర్ ఎంపీడీవో చంద్రశేఖర్, సంబంధిత శాఖల  ఇఇ లు తదితరులు పాల్గొన్నారు.