మైనారిటీ ప్రీ –మెట్రిక్ స్కాలర్షిప్స్ గడువు పొడగింపు

Published: Wednesday October 19, 2022
జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి
వికారాబాద్ బ్యూరో 18 అక్టోబర్ ప్రజా పాలన : భారత ప్రభుత్వం ద్వారా మైనారిటీ విద్యార్థులకు అందించే ప్రీ –మెట్రిక్ స్కాలర్షిప్స్ ఈనెల 31 వరకు గడవు పొడగించడమైనదని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  మైనారిటీ  విద్యార్థులైన ముస్లిం, క్రైస్తవులు, బౌద్ధులు,సిక్కులు, పార్సీలకు అందించే ప్రీ –మెట్రిక్ స్కాలర్షిప్స్  2022-23 వ సంవత్సరమునకు గాను 1 వ తరగతి నుండి 10 వతరగతి విద్యార్థులకు అన్ని ప్రభుత్వ మరియు  ప్రైవేటు  పాటశాలల విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేది అక్టోబర్ 31 వరకు  పొడగించడం జరిగింది అన్నారు.  విద్యార్థులు అందరు  www.scholerships.gov.com.in వెబ్ - సైట్ ద్వార దరఖాస్తు   చేసుకొని అట్టి హార్డ్ కాపీ తమ పాఠశాలలో అందజేయాలని సూచించారు. హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్స్ 2022 (9,10 వ తరగతి ఇంటర్మీడియట్ బాలికలకు మాత్రమే )  దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించుటకు చివరి తేదిని డిసెంబర్, 31 వరకు పొడగించడం  జరిగిందన్నారు. పూర్తి వివరాలకు సెల్: 8978964132 జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శాఖా కార్యాలయం ,రూమ్ నం. S-17 వికారాబాద్ నూతన కల్లెక్టరేట్ కార్యాలయం నందు సంప్రదిచాలని తెలిపారు.