పదవ తరగతి మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్ వెంటనే రిలీజ్ చేయాలి. ..ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాపోల

Published: Thursday December 29, 2022

 విద్యాసంవత్సరం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను 11 పేపర్ల నుండి 6 పేపర్లకు కుదించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా మోడల్ పేపర్లు గానీ, బ్లూ ప్రింట్ గానీ ఇప్పటి వరకు విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేయలేదని, దానితో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లదండ్రులు ఆందోళన చెందుతున్నారని ప్రైవేట్ పాఠశాలల సంఘం ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు  బుధవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండి ముందుకు నడిపించాల్సిన ప్రభుత్వము మేము అడిగేంతవరకు మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్ రిలీజ్ చేయకపోవడం శోచనీయమని వారు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును జీవితంలో మలుపు తిప్పేవే పదవ తరగతి పరీక్షలని,  పబ్లిక్ పరీక్షలకు  కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉందని, ఇంతవరకు మోడల్ పేపర్లు బ్లూ ప్రింట్ రిలీజ్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని,  ఇప్పటివరకు మోడల్ పేపర్ రిలీజ్ కాకపోవడంతో ఉపాధ్యాయులు కూడా వారి పాఠశాలలో విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దాలో రివిజన్ టెస్ట్ పెట్టడానికి పేపర్లు ఏ విధంగా తయారు చేయాలో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు.ఈ రెండు రోజుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు, ఎస్ సీ ఈ అర్ టి అధికారులు వెంటనే బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్లు రిలీజ్ చేసే విధంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి గారు చొరవ చూపాలనిపత్రికా ప్రకటన ద్వారా వారిని  కోరారు.