నృజనాత్మకతను ప్రోత్సహించే విధంగా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం : జిల్లా కలెక్టర్ భారతి హోళ

Published: Thursday July 22, 2021

మంచిర్యాల బ్యూరో, జూలై 21, ప్రజాపాలన : రాష్ట్రంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా ప్రజలలోని సృజనాత్మకతనను ప్రోత్సహించే విధంగా  ఆవిష్కర్తలు చేసిన ఇన్నోవేషన్ల ఆన్లైన్ ఎగ్జిబిషన్ లింక్ ద్వారా ప్రదర్శన చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, మహిళలు, ఎవరైనా పాల్గొన వచ్చనిపేర్కొన్నారు. అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణలు ప్రోత్సహించబడతాయని తెలిపారు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించి ఆరు వాక్యాలు, రెండు నిమిషాల గల వీడియో, ఆవిష్కరణ యొక్క నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నంబర్, వయస్సు, ప్రస్తుత వృత్తి, చిరునామా పూర్తి వివరాలతో 9100678543 కు వాట్సాప్ చేయాలని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 25వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, అందిన దరఖాస్తుల నుండి మొదటి షార్ట్ లిస్ట్ తరువాత ప్రతి జిల్లా నుండి 5 ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడు, సి విభాగం పర్యవేక్షకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.