తల్లి తండ్రులు లేని వారికి ఆదరణ కల్పిద్దాం

Published: Monday June 28, 2021
ఔషద వ్యాపారి నేరెళ్ల వేణుగోపాలరావు
మధిర ప్రజా పాలన ప్రతినిధి 27వ తేదీమానవ సేవే మాధవ సేవ" అన్నట్లు మధిర ఆర్య వైశ్య మిత్రులకు అపారమైన సేవా భావం వున్నది అని ప్రముఖ సామాజిక సేవకుడు లంకా కొండయ్య తెలిపారు. శనివారం రాత్రి మధిర వైరా రోడ్ లో శ్రీ హరి  మెడికల్ ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ యజమాని శ్రీ నేరెళ్ల వేణుగోపాలరావు లంకా కొండయ్య సూచన మేరకు చిన్నతనంలో తల్లీ తండ్రులను కోల్పోయిన ఆశ బాధిత కుటుంబంనకు చెందిన నిరుపేద రోజూవారి కూలీగా పనిచేసే వ్యక్తికి నెలకు సరిపడ బియ్యం వితరణ చేసినారు చిరు వ్యాపారం చిన్న మందుల దుకాణం పెట్టుకొని జీవిస్తూ రోజూ వారి ఉదయం సాయంత్రం మనం ఇంటిలో వండుకొనే బియ్యంలో ఒక గుప్పెడు తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఎక్కువ మొత్తం అయ్యాక ఆ బియ్యంను ఇలాంటి నిరుపేద వారికి సహాయం చేస్తే బాగుంటుంది అనే కొండయ్య సలహాతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నేరెళ్ల వేణుగోపాలరావు తెలియ పరిచినారు. అదే విధంగా ప్రతి ఒక్కరు ఇలాంటి సేవా సహాయం కడుపేదలకు చేయటానికి మానవత్వంతో ముందుకు రావాలని లంకా కొండయ్య సూచించారు. వేణుగోపాల్ కుటుంబంనకు హృదయ పూర్వక అభినందనలు తెలిపినారు.