21న మినీ జాబ్ మేళా

Published: Monday June 20, 2022

మంచిర్యాల టౌన్, జూన్ 19, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 21న మినీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకటరమణ తెలిపారు. స్థానిక ఐటీఐ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్, జిరాక్స్ ధ్రువీకరణ పత్రాలు ఫొటో, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని ఆయన తెలిపారు.