ముదిరాజులకు దక్కని సంక్షేమ ఫలాలు

Published: Monday November 21, 2022
జన్నారం, నవంబర్ 20, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్రంలోవి ప్రతి నియోజకవర్గంలో ముదిరాజులు ఉన్నప్పటికీ అత్యధిక బలమైన సామాజిక వర్గంగా ఉన్న ముదిరాజులకు ప్రభుత్వపరంగా దక్కాల్సిన ఫలాలు పూర్తిస్థాయిలో దక్కడం లేదని ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు దండవేణి చంద్రమౌళి ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ యువజన విభాగం మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఐలవేణి నరసయ్య ముదిరాజ్, ముదిరాజ్ మత్స్యకార సొసైటీ ఉపాధ్యక్షుడు సిరవేణి పెద్దిరాజుం ముదిరాజ్ (పోన్కల్) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
తెలంగాణ ముదిరాజ్ మహాసభ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో జన్నారం పట్టణంలో ఈనెల 21న తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం జెండా పండుగ మత్స్యకార దినోత్సవం గోడపత్రాలను ఆదివారం మండల కేంద్రంలోని జన్నారం ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ముదిరాజులు గ్రామ గ్రామాన పెద్దమ్మతల్లికి ప్రతిరూపంగా ఉన్న పసుపు కుంకుమలతో కూడిన ముదిరాజ్ జెండా ఎగరవేసి ముదిరాజ్ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ముదిరాజులు మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బిసి డి నుండి బీసీ ఏ కు మార్చే అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ కమిషన్ ద్వారా ముదిరాజులను బిసి ఏ లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోలీస్ కిష్టయ్యతో సహా 84 మంది ముదిరాజ్ బిడ్డలు ఆత్మార్పణం చేసుకున్న ముదిరాజులకు ఎలాంటి గుర్తింపు లభించలేదని, నవంబర్ 21 ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ పాటు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని ముదిరాజులు ప్రతి గ్రామంలో పెద్దమ్మతల్లి పసుపు కుంకుమలతో కూడిన ముదిరాజ్ జెండాను ఎగరవేసి ముదిరాజ్ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా మండల ముదిరాజులు మాట్లాడుతూ మండలంలోని 29 గ్రామపంచాయతీలో గాను 9 గ్రామ పంచాయతీలు ముదిరాజులు నివాసముండి జీవనం కొనసాగిస్తున్నారు. మత్య్చకార సొసైటీలో పోన్కల్ గ్రామపంచాయతీ ముదిరాజులకు మాత్రమే సభ్యత్వం కలిగి ఉన్నారన్నారు. మిగతా ఎనిమిది గ్రామపంచాయతీలలో ముదిరాజులకు, మత్యకార సొసైటీలో సభ్యత్వం లేకుండా జీవనాదారం లేకుండా, జీవనం కొనడానికి చాలా కష్టంగా ఉందని, వారికి కూడా మత్స్యకార సొసైటీలో సభ్యత్వం కల్పించాలని మండలంలోని వివిధ గ్రామల ముదిరాజులు కోరారు. ఈ కార్యక్రమంలో బోయిని రాజన్న ముదిరాజ్, పోన్కల్, గుర్రపు రవి ముదిరాజ్, జన్నారం, ముదిరాజ్ మహాసభ మండల ఉపాధ్యక్షుడు ముద్దుల శంకర్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం కోశాధికారి గుర్రపు రవి ముదిరాజ్, రెడ్డివేణి శంకరయ్య ముదిరాజ్,గుర్రపు లక్ష్మణ్ ముదిరాజ్, గుర్రపు జగన్ ముదిరాజ్, గుర్రపు సురేష్ ముదిరాజ్, గుర్రపు రాజు ముదిరాజ్ చింతలపల్లి, ముదం రవి ముదిరాజ్ పెరకోండ రాజన్న ముదిరాజ్ బాదంపల్లి, సింగాసాని సంతోష్ ముదిరాజ్, సింగాసాని రమేష్ ముదిరాజ్, దండవేణి శ్రీధర్ ముదిరాజ్, దండవేణి శ్రీనివాస్ ముదిరాజ్ చేర్లపల్లి, పాంబాల నరసయ్య ముదిరాజ్ కవ్వాల్, పాల్గొన్నారు.