పుస్తక పఠనం జీవన విలువలు పెంపొందిస్తుంది

Published: Monday February 22, 2021

ప్రతి తల్లిదండ్రి చిన్నారులకు పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి
నల్సర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ హారతి వాగేషణ్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21 ( ప్రజాపాలన ) : ఒక మంచి పుస్తక పఠనం ద్వారా జీవన విలువలు పెంపొందించుకోవచ్చని నల్సర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ హారతి వాగేషణ్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మండలానికి చెందిన ఎర్రవల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మల్లమ్మ హన్మంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో శంకర్ రెడ్డి ప్రోత్సాహంతో గ్రామంలో వికాస గ్రంథాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పుస్తక పఠనం తల్లిదండ్రులతో పాటు తమ సంతానాన్ని   కూడా చదివించేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ఆడపిల్లలు, మహిళలు తమ కుటుంబంలో ముందుగా పుస్తక పఠనం చేయించాలని కోరారు. పిల్లల అభిరుచికి తగిన పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రజలందరికి ఉపయోగపడే పుస్తకాలను చదువుకుంటే మంచి విచక్షణ జ్ఞానం లభిస్తుందని ఆకాంక్షించారు. గ్రంథాలయంలోని ప్రతి పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నం చేయడం గొప్ప విశేషమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సి.వనజ, రంగవజ్జుల భరత్వాజ, సైంటిస్ట్ బులుసు శ్రీనివాస్, కార్డయాలజిస్ట్ రచయిత విరివింటి విరించి, సోషల్ ఆక్టివిటీ దీప్తి, ఎస్ బిఐ బ్యాంక్ మేనేజర్ కరవది సరస్వతి, ఉపాధ్యాయురాలు చిత్రలేఖ భరణి, రచయిత వెల్లంకి గీత, సోషల్ ఆక్టివిస్ట్ రాణి, ప్రభాకర్ రెడ్డి, తూంకుంట రాంచందర్, గఫార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.