తెలంగాణ రాష్ట్ర ప్రగతి పథంలో కార్మికులది క్రియాశీల పాత్ర.

Published: Monday May 02, 2022
మధిర మే 1 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారంనాడు మేడే సందర్భంగా మధిర లో టిఆర్ఎస్ ఎస్ కే యు వారి ఆధ్వర్యంలో వారి మోటార్ సైకిల్ ర్యాలీ. మధిర పట్టణంలో టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మేడే వేడుకల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుపాల్గొన్న రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు. తమ శ్రమను ధారపోస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న కార్మిక సోదరులు అందరికీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాడు మేడే సందర్భంగా మధిర పట్టణంలో పలు చోట్ల టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలసి పాల్గొన్న ఆయన జెండా ఎగురవేశారు. ముందుగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీగా ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ వద్దకు చేరుకొని అక్కడ కార్మిక విభాగం మిషన్ భగీరథ జిల్లా అధ్యక్షుడు జిల్లేపల్లి బాబురావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను కొండబాల కోటేశ్వరరావు ఎగురవేశారు అనంతరం అక్కడ నుండి ర్యాలీగా అంబేద్కర్ సెంటర్ కు చేరుకొని అక్కడ పేయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లెపోగు బుజ్జిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఎగురవేశారు అక్కడ నుండి మధిర పట్టణంలోని రాయపట్నం సెంటర్ వద్దకు చేరుకొని కార్మిక విభాగంఆటో యూనియన్ అధ్యక్షుడు గూడెల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఎగురవేశారు అనంతరం అక్కడ నుండి ర్యాలీగా మధిర మండల పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకొని అక్కడ కార్మిక విభాగం గ్రామ పంచాయితీ మల్టీ పర్పస్ వర్కర్స్ అధ్యక్షుడు మోదుగు నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా కార్యక్రమాల్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ శ్రమ జీవుల కష్టానికి గుర్తింపు, చెమట చుక్క విలువకు చాటింపు మేడే అని తెలిపారు. కార్మిక సోదరుల కృషితో నేడు తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందని పేర్కొన్నారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసిందని విమర్శించారు. ప్రజల డబ్బు తో నిర్మించుకున్న రైల్వే, బిఎస్ఎన్ఎల్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ రంగం, ఓడరేవులు, గనులు, ఎయిర్ ఇండియా, ఆయిల్ సెక్టార్ వంటి మొదలగు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్ధలకు ధారదత్తం చేస్తుందని మండిపడ్డారు దీని వల్ల కార్మిక లోకానికి నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయని కార్మికుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో మధిర మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మధిర సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ కూన నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, ఇక్బాల్, నాయకులు ముత్తవరపు ప్యారీ, మెడికొండ కిరణ్, యర్రగుంట రమేష్, గద్దల నాని, కొఠారి రాఘవరావు, బోయపాటి వెంకటేశ్వరరావు, రావూరి రాము, శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, ఆళ్ల నాగబాబు, బట్టా గోవిందారాజు, జెవి రెడ్డి, గద్దల రాజా, జగన్నాథచారి, ఆవుల రామకృష్ణ, ముస్లిం మైనారిటీ నాయకులు అక్బర్, నాగులవంచ రామారావు, వేల్పుల శివ, విజయ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్మిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.