రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ కు ఘన సన్మానం

Published: Tuesday April 06, 2021
సన్మానించిన ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సంస్థ 
 
జగిత్యాల, ఏప్రిల్ 05 (ప్రజాపాలన): రక్తదానంపై యువతలో అవగాహాన కల్పించినందుకు సమాజసేవలో ముందుండి  తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన కటుకం గణేష్ పలు సన్మానాలు అవార్డులు అందుకున్న సందర్బంగా ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజున జరిగిన కార్యక్రమంలో కటుకం గణేష్ ను ఆ సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఓరుగంటి రమణ రావు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరం అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది కటుకం గణేష్ అని రక్తదానం అంటే ప్రాణదానం అని యువతలో చైతన్యం నింపి వారి చేత రక్తదానం చేపించిన గొప్ప వ్యక్తి అని సమాజసేవలో ముందుండే వ్యక్తి అని ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు అని అందరికి ఆదర్శప్రాయుడు అని ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఎన్నో చేయాలని మరెన్నో అవార్డు లు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ టి అర్ ఎస్ అధ్యక్షులు అన్నం అనిల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, రుద్ర శ్రీనివాస్, గుడ్ల మనోహర్, గడ్డం మధు, వాసాల గణేష్, ఎండి సానవోద్దీన్, అల్లె రమేష్, ఏం ఏ  భారీ తదితరులు పాల్గొన్నారు.