ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలి

Published: Saturday July 09, 2022
కోరుట్ల, జూలై 08 ( ప్రజాపాలన ప్రతినిధి ):
దివంగత ముఖ్యమంత్రి డా.వై.యస్ రాజశేఖర్ రెడ్డి  73వ జయంతిని పురస్కరించుకుని  శుక్రవారం రోజున కోరుట్ల పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు  అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజంలు  మాట్లాడుతూ వైఎస్సార్ పాలన సంక్షేమానికి, అభివృద్ధి కి స్వర్ణయుగం, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జన నేత డా.వై.యెస్ రాజశేఖర రెడ్డి. భారత దేశ చరిత్ర పుటల్లో లికించే విధంగా ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి, ఉచిత విద్యుత్, ఫీజు రేయింబస్సెమెంట్, 108,104 సేవలు, ఆరోగ్య శ్రీ  లాంటి సంక్షేమ  పథకాలతో సంక్షేమానికి బాట వేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యావత్ తెలుగు ప్రజలకు గుర్తింపు లభించే విధంగా కృషి చేసిన మహనీయులు డా.వై యెస్ రాజశేఖర రెడ్డి సేవలను గౌరవిస్తూ, గుర్తిస్తూ మన బాధ్యతగా   భారత రత్న  బిరుదాంకితుడిని చేసి గౌరవించాల్సిందిగా యావత్ తెలుగు ప్రజల తరుపున  ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక కంఠంతో భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందిగా కోరుతూ  ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎం.ఏ నయిం, ప్రధానకార్యదర్శులు తుపాకుల బాజన్న,  బన్నరాజేశం, పట్టణ ఎస్ సి సెల్ అధ్యక్షులు పసుల కృష్ణప్రసాద్,  మండల ఎస్.సి సెల్ అధ్యక్షులు మంథని గంగనర్సయ్య,  కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీరాముల అమరేందర్,  పట్టణ సహాయ కార్యదర్శులు ఎంబేరి సత్యనారాయణ , చిటిమెల్లి రంజిత్ గుప్త, మ్యాదరి లక్ష్మణ్, నజ్జు , అసద్ , ఎన్నం రమేష్,  జబ్బార్, వాసం అజయ్, శషి తదితరులు పాల్గొన్నారు