నియోజవర్గంలోపట్టు బిగిస్తున్న టిడిపి* కలిసొచ్చిన చంద్రబాబు పర్యటన*

Published: Tuesday December 20, 2022
మల్లాది నాయకత్వంలో ఉదృతంగా పోరాటాలుఆదరిస్తున్న ప్రజలు, అండగా నిలిచిన డాక్టర్ వాసిరెడ్డి*
మధిర రూరల్ డిసెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలోరాజకీయ చైతన్యం కలిగిన మధిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సాధించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఆధ్వర్యంలో మధిర టిడిపి పార్టీ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు నాయకత్వంలో ముమ్మరంగా కృషి చేస్తున్నారు. 80 సంవత్సరాల వయసును సైతం లెక్కచేయకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం టిడిపి పట్టణ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మధిర నియోజకవర్గంలో బలోపేతానికి చాప కింద నీరు లాగా పనిచేస్తున్నారు. మధిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. ప్రతి గ్రామంలో క్యాడర్ ఉంది. నాయకులు పార్టీలు మారినా కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం లోనే కొనసాగుతున్నారు. ఆంధ్ర సరిహద్దున మధిర నియోజకవర్గం ఉండటంతో పాటు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం కలిగిన కమ్మ సామాజిక వర్గం, బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా మధిర నియోజక వర్గంలో ఉన్నారు. ఈ సామాజిక వర్గాలకు పసుపు జెండా కనిపించినా, సైకిల్ గుర్తు కనపడ్డా కేరింతలు కొడుతూ ఆనందంలో ఊగిపోతారు. జిల్లాలో ఎక్కడలేని విధంగా మధిర మండలంలోని చిలుకూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు టిడిపిలో చేరటం విశేషం. డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు సమిష్టి నాయకత్వంతో కష్టపడి పని చేయడం వలన జిల్లాలో ఎక్కడలేని విధంగా మధిర మున్సిపాలిటీలో మూడు కౌన్సిలర్ స్థానాలను టిడిపి గెలుపొందింది. అదే విధంగా ఎంపిటిసి, సహకార సంఘం, సర్పంచ్ ఎన్నికల్లో పలుచోట్ల టిడిపి గెలుపొందింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా సమస్యలపై పోరాడుతూ మరోవైపు సామాజిక సేవా కార్యక్రమంలో టిడిపి ముందుంది. వేసవిలో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. పేదలకు దుస్తులు పంపిణీ, అన్నదానాలు ఏర్పాటు చేయటం లాంటి నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమాల పేరుతో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు ప్రజల్లో ఉంటున్నారు. పరామర్శల పేరుతో కార్యకర్తలు  కష్ట సుఖాల్లో  డాక్టర్ వాసిరెడ్డి రామనాథం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తూ భరోసా నిలుపుతున్నారు. ఈనెల 21న చంద్రబాబు నాయుడు ఖమ్మంతో పాటు మధిర నియోజకవర్గం పరిధిలోని పాతర్లపాడు వస్తున్న తరుణంలో మధిర నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో జన సమీకరణ చేసేందుకు జిల్లాలో ఎక్కడలేని విధంగా  మధిరలో ప్రచార రథాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాన వీధుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆర్థికంగా బలంగా ఉండి లౌక్యంగా వ్యవహరిస్తూ, జూనియర్ సీనియర్ నాయకులను సమన్వయం చేసుకుంటూ మల్లాది హనుమంతరావు ముందుకు కొనసాగుతున్నారు టిడిపి పట్టణ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే మధిరలో టిడిపిని కీలక శక్తిగా మార్చేందుకు ఎంతో వ్యూహంతో వ్యవహరిస్తూ కష్టపడి పని చేస్తున్నారు. మధిరలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఉన్న పార్టీలే ఇప్పటివరకు ఎన్నికల్లో గెలుపొందుతూ వస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి మధిర నియోజకవర్గాన్ని టిడిపికి కంచు కోటగా మార్చటమే తమ లక్ష్యం అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు పేర్కొన్నారు.